రాయల సీమ ముఖ చిత్రాన్ని మార్చే కడప స్టీల్ ఫ్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భూమి పూజ చేశారు. కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. 2700 ఎకరాల్లో, రూ. 18వేల కోట్ల పెట్టుబడితో, మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్ను నిర్మించనున్నారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి ఫ్యాక్టరీకి నీటి సరఫరా అందించనున్నారు. జమ్మలమడుగు నుంచి 12 కి.మీల మేర రైల్వే లైన్ను ఏర్పాటు చేయనున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణుడు మధుసూదనరావును ప్రభుత్వం నియమించింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో జిల్లాలో ఊహించని ప్రగతి సాధ్యామని అన్నారు. పరిశ్రమలు, రాజధాని, నిదులు లేకపోయినా ధర్మపోరాట దీక్ష చేసినా కేంద్రం స్పందించలేదని అన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ భాద్యత టీడీపీదే. మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పడానికే ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసారని అన్నారు. మొదటి విడతగా 18వేల కోట్లతో పనులను ప్రారంభిస్తాం. ఎకో సిస్టమ్ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు వుంటాయని అన్నారు. అన్ని రాయితీలు ఇస్తామని చెప్పినా మీన వేషాలు లెక్కపెట్టిన కేంద్రం. రాయితీలు వదులుకోమని కోరమే తప్ప కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరలేదు. కలిసి ఉన్నప్పుడు దాడులు చెయ్యని కేంద్రాన్ని నిలదీయ్యడంతో పోరాటం చెయ్యాల్సిన వైసీపీ ఎంపీలు పారిపోయివచ్చారని విమర్శించారు. నదుల అనుసంధానంతోనే సాగుజలాలు సాద్యం. రాయలసీమ జిల్లాలు పోటి పడి అభివృద్ధి చెందడం ఖాయయని అన్నారు. రాంత్రిబవళ్ళు కష్టపడటంతోనే గండికోట నీళ్ళు తీసుకు రాగలిగాం. ప్రతి పనికి అడ్డంకులు వైకాపా సృష్టించింది. నెలలోపు భూములు ఇస్తే మూడు నెలలో పరిశ్రమ పనులు ప్రారంభిస్తాం. అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. ఇచ్చి హమీ అమలు చెయ్యడమే ధ్యేయం. అభివృద్ధి కి రాజకీయాలు అడ్డంకి కారాదని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు హాజరయ్యారు.