హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టు ఎదుట ఏపీ లాయర్ల ఆందోళనకు దిగారు. విభజనపై హైకోర్టు రిజిస్ట్రి జోక్యం చేసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. కటాఫ్ డేట్ పొడిగించాలని ఏపీ న్యాయవాదుల డిమాండ్ చేశారు. సిబ్బంది, ఫైళ్ల విభజన ఇంకా జరగలేదని, మూడు రోజుల్లో సిబ్బంది, న్యాయవాదులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. అలాగే ట్రాన్స్ఫర్ పిటిషన్ల పరిస్థితి ఏమిటి అని ఏపీ న్యాయవాదులు ప్రశ్నించారు.