YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిపుల్ తలక్ పై లోక్ సభలో చర్చ

త్రిపుల్ తలక్ పై లోక్ సభలో చర్చ
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై  గురువారం లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది.  ప్రత్యేకించి ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లు తీసుకురావడం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.  మానవత్వాన్ని ప్రోత్సహించేందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు.  భారత మహిళలందరికీ న్యాయం చేయడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు.  ట్రిపుల్ తలాక్ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని గతవారం ప్రతిపాదించగా.. ఎలాంటి అవాంతరాలు సృష్టించకుండా చర్చకు సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం ఈ అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావడంపైనా ఆయన స్పందించారు.  దేశ వ్యాప్తంగా ముస్లిం మహిళలకు వారి భర్తలు చిన్న చిన్న విషయాలకు కూడా అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు.  అలాంటి కేసుల్లో పార్లమెంటు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇరవై  ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాక్ను నిషేధించాయనీ,   అలాంటప్పుడు లౌకిక దేశమైన భారతదేశంలో దాన్ని ఎందుకు కొనసాగించాలని ప్రశ్నంచారు.  ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నారు.  రాజకీయ కోణంలో దీన్ని చూడవద్దనీ,  బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాలన్నీ వింటామని న్యాయమంత్రి పేర్కొన్నారు.

Related Posts