YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన వైకాపా దీక్ష

 ముగిసిన వైకాపా దీక్ష
రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’దీక్ష ప్రారంభమైంది.   ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఈ దీక్ష చేపట్టింది.  ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.  హోదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై వైకాపా గర్జన దీక్షలు నిర్వహించింది.  అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసారు. దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  సాయంత్రం వరకు కొనసాగిన  ఈ దీక్ష లో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అసెంబ్లి, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు

Related Posts