YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇస్రోలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇస్రోలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇస్రో ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇస్రో కేంద్రాల్లోని వివిధ విభాగాల్లో ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 26న ప్రారంభమైంది. జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 సైంటిస్ట్/ ఇంజినీర్: 18 పోస్టులువిభాగాలు..
సివిల్ 09
ఎలక్ట్రికల్ 05
రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ 02
ఆర్కిటెక్చర్ 01
ఎలక్ట్రికల్ (సెమీకండక్టర్ ల్యాబ్, చండీగఢ్) 01
మొత్తం ఖాళీలు 18
విద్యార్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
వయోపరిమితి: 01.01.2019 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు: రూ.100. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ప్రభత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు విధిగా పనిచేస్తున్న సంస్థ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబరు, పోస్టు కోడ్ వివరాలను జతచేసి జనవరి 21 లోగా  పంపాల్సి ఉంటుంది
ఎంపిక విధానం: రెండు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో రాతపరీక్ష, రెండో దశలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఇలా.. 
* రాతపరీక్షకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
* రాతపరీక్షకు ఎంపికైన వారి వివరాలను మార్చి మొదటి వారంలో అభ్యర్థులకు వ్యక్తిగత ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. 
* మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. 
* రాత పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
* ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం స్కోర్ చేసిన అభ్యర్థులనే ఉద్యోగాలకు అర్హులుగా పరిగణిస్తారు. 
* రాతపరీక్ష అనంతరం మూడురోజుల్లో పరీక్ష కీని విడుదల చేస్తారు. అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారు. 

Related Posts