YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వచ్చేది జగన్ ప్రభుత్వమే

వచ్చేది  జగన్ ప్రభుత్వమే
2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ నేత, సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంచన దీక్ష’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేది రాజన్న రాజ్యమేనని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదాపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని పృథ్వీరాజ్‌ అన్నారు. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో ఆయన చేసిన జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు. తనలో 70శాతం కాంగ్రెస్ రక్తమే ఉందని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ చేపడుతున్న పాదయాత్రకు వెల్లువలా వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ పాలన ఆయనతోనే సాధ్యమని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. 

Related Posts