యువ న్యూస్ సినిమా బ్యూరో:
పద్మ శ్రీ, పద్మ భూషణ్ శ్రీ పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం.. అందరూ ముద్దుగా ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. తెలుగు, తమిళ, కనడ, హిందీ బాషలలో 40,000 పైగా పాటలు పాడారు. 1996 లో 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రంతో అయన సినీ ప్రస్థానం మొదలైంది. తరువాత కే.విశ్వనాధ్ గారు దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం' చిత్రంలో అయన పాడిన పాటలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున, రవితేజ ఆలా మూడు తరాల హీరోల సినిమాలకు అయన పాటలు పాడారు. అయన ఏ హీరోకి పాడిన సాక్ష్యాత్తు ఆ హీరోయే పాడినట్లు ఉండేది. ఎన్టీఆర్ నుంచి అల్లు రామలింగయ్య వరకు అయన ఎవరికి పాడిన వాళ్ళు పాడినట్లే ఉండేది.
పాటలే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అయన ఎన్నో సేవలు అందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్ వంటి హీరోలకు అయన గాత్రదానం చేసారు. పి.సుశీల, ఎస్ జానకి, వాణి జయరాం వంటి ప్రముఖ గాయనీలతో కలిసి ఎన్నో డ్యూయెట్లు పాడారు. ఇళయరాజా సంగీతలో అయన ఎన్నో హిట్ పాటలు పాడారు.ఇళయరాజా - బాలు కాంబినేషన్ లో వచ్చిన పాటలు వింటే ఇప్పుడికి చాలా ఆహ్లదకరంగా ఉంటాయి. అయన పాడుతా తీయగా వంటి షో ని ప్రారంభించి ఎంతో మంది నూతన గాయని, గాయకులను ప్రోత్సహించారు. ప్రస్తుతం అయన ఈటీవీ లో ప్రసారమయ్యే 'స్వరాభిషేకం' కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రాంతాలలో పాటలు పాడుతున్నారు.
అటువంటి బాలు గారిని తెలుగు దర్శక నిర్మాతలు మర్చిపోయారు. దర్శకులు, నిర్మాతలు బహుశా ఆయనకి వయస్సు అయిపోయింది అనుకుంటున్నారేమో.. సంగీతానికి..సాహిత్యానికి.. స్వరానికి వయస్సు తో సంబంధం లేదు. మన దర్శక నిర్మాతలు గాయకులను పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళు పాడే పాటకు వాళ్ళకే అర్ధం తెలియదు. అటువంటి వారిని తీసుకుని వచ్చి మన తెలుగు సాహిత్యాన్ని కుని చేయిస్తున్నారు. కనుక ఇప్పటికైనా మన దర్శక నిర్మాతలు తమ ఆలోచన సరళిని మార్చుకుని మన తెలుగువారికి.. మన సాహిత్యం మీద గౌరవం ఉన్న వారికీ అవకాశాలు ఇచ్చి మన తెలుగు పాటను బ్రతికిస్తారని కోరిక