YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏపీ పర్యాటకాభివృద్ధికి సింగపూర్‌ సహకారం ఆ దేశ ప్రతినిధులను కోరిన మంత్రి నారా లోకేశ్‌

ఏపీ పర్యాటకాభివృద్ధికి సింగపూర్‌ సహకారం       ఆ దేశ ప్రతినిధులను కోరిన మంత్రి నారా లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి సింగపూర్ సహకారం కావాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ద్వీపాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంటేనే పర్యాటక పరంగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ లోకేశ్‌కు సూచించారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా సింగపూర్ టూరిజం బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్వర్డ్‌తో పాటు సింగపూర్ మినిస్టర్ ఇన్‌ఛార్జ్‌ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ ఈశ్వరన్‌తోనూ మంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. సింగపూర్‌లో టూరిజం అభివృద్ధికి తీసుకున్న చర్యలు, రానున్న కాలంలో మరింతగా టూరిజం అభివృద్ధికి తీసుకొస్తున్న పాలసీల గురించి మంత్రి నారా లోకేశ్‌కు ఎడ్వర్డ్‌ వివరించారు.సింగపూర్ పాలసీలు అధ్యయనం చేసి టూరిజం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో ఎఫ్1 హెచ్2ఓ బోట్ రేస్ కూడా విజయవంతంగా నిర్వహించామని మంత్రి వారికి వివరించారు. కేవలం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులని ఆకర్షించడమే కాకుండా ఇతర దేశాల పర్యాటకులను సైతం ఆకట్టుకునే విధంగా టూరిజం సర్క్యూట్స్ అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేశ్‌ వివరించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇలా కనీసం ఐదు సర్క్యూట్స్ అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నామన్నారు. దీనికి సింగపూర్ టూరిజం సహకారం కావాలని మంత్రి లోకేశ్‌ కోరారు. సింగపూర్ అభివృద్ధి గురించి మంత్రి ఈశ్వరన్ లోకేశ్‌కు వివరించారు. అమరావతి అభివృద్ధిలో పురోగతి గురించి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఈశ్వరన్‌కి లోకేశ్‌ తెలిపారు.పార్టనర్‌షిప్‌ ఆఫీస్ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సింగపూర్ కో-ఆపరేషన్ ఎంటర్‌ప్రైజస్‌ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. కేవలం నాలుగేళ్లలో అనేక పాలసీలు, రాయితీలు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ హబ్‌గా మారుతోందని తెలిపారు. మొబైల్ తయారీలో ఉన్న 200 విడిభాగాల తయారీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీసీఎల్‌ భూమి పూజ ఇటీవల జరిగిందని, త్వరలో రిలయన్స్ జియో, ఓల్టాస్ కంపెనీల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం చెయ్యనున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి క్లస్టర్ మోడల్ అమలు చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్ పార్కుల నిర్మాణం కోసం సహకారం కావాలని మంత్రి నారాలోకేశ్‌ సింగపూర్‌ ప్రతినిధులను కోరారు.

Related Posts