YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

ఇయర్ ఫోన్స్ తో డ్రైవ్ చేస్తే జైలే

ఇయర్ ఫోన్స్ తో  డ్రైవ్ చేస్తే జైలే

 చెవులలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాహనాలను నడుపుతున్నారా? అయితే ఇక నుంచి సాంబార్ రైస్ తినడానికి సిధ్ధంగా ఉండండి. నగరంలో యాక్సిడెంట్ లను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలను నడుపుతున్న 192 మందిపై మోటర్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 184 కింద కేసులు బుక్ చేశారు. ఇందులో ఆరుగురికి జైలు శిక్ష పడింది.

వెనక, పక్కన వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనాలను నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని.. వాటిని నియంత్రించేందుకే ఈ చర్యలు చేపట్టామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలను కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుతామని, జైల్ టర్మ్, కౌన్సెలింగ్ ముగిసిన తర్వాతనే వారికి వాహనాలను తిరిగి అప్పగిస్తామని తెలిపారు. అంతేకాకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతున్న వారిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. రోడ్డుపై నడిచే సమయంలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్లటం కూడా చట్టవ్యతిరేకం అని.. దాని కోసం ఓ రూల్ తీసుకొస్తున్నామని తెలిపారు.

Related Posts