ఉండవల్లి ప్రజావేదికలో ఆరవ శ్వేతపత్రాన్ని ఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసారు. శుక్రవారం విడుదల అయిన శ్వేతపత్రంతె విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అంశాలును పొందుపరచారు. నాలుగున్నరేళ్లుగా విద్య, వైద్య రంగాలలో అమలు చేసిన పథకాలు, చేపట్టిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన ఆవిష్కరణలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్బంగా వివరించారు. తరువాత అయన మాట్లాడుతూ గురువారం సహజ వనరుల నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేశాం. ఈ రోజు మానవ వనరుల అభివృద్ధిపై వివరాలు వెల్లడిస్తాం. వనరులు దుర్వినియోగం చేయడమే కాదు, మానవ వనరులను వినియోగించుకోవాలి. మేం మానవ వనరుల విలువను గుర్తించామని అన్నారు. గత హయాంలో ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు తీసుకురావడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. విభజన తర్వాత ఏపీలో విద్యాసంస్థలు లేని లోటు కనిపించింది. నాలుగున్నరేళ్లలో విద్యాభివృద్ధిపై దృష్టిపెట్టాం. నాలెడ్జ్ మిషన్ను ఏర్పాటు చేసుకున్నాం. 50 % శాతం జనాభా 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉన్నారు. డ్రాపవుట్లు తగ్గించడం, ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలలపై దృష్టిపెట్టాం. మౌలిక వసతుల కల్పన – అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, హైస్కూళ్లలో 100% ఫర్నిచర్, టాయిలెట్ల నిర్వహణకు రూ.100 కోట్లు, పాఠశాలల్లో 1,217 వర్చువల్ క్లాస్ రూములు, 3,640 డిజిటల్ క్లాస్ రూములు, 46 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములు, బయోమెట్రిక్ అటెండెన్స్, అన్ని జూనియర్, డిగ్రీ కాలేజీలకు వైఫై సౌకర్యం కల్పించామని అన్నారు. అన్ని పాఠశాలల్లో నరేగా నిధులతో ప్రహరీ గోడలు నిర్మిస్తున్నాం. 11 ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రానికి తీసుకువచ్చాం. వచ్చే పదేళ్లలో వివిధ విద్యాసంస్థలు రూ.11,360 కోట్ల పెట్టుబడులు, 1,72,982 మంది చదివేందుకు అవకాశం వుంది. 6 యూనివర్సిటీలు ఎన్ ఐ ఆర్ ఎఫ్ లో టాప్ 100లో ఉన్నాయి. రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాలకు గాను 10 విశ్వవిద్యాలయాలకు నాక్ అక్రిడేషన్ వచ్చింది. నైపుణ్య శిక్షణ పెద్దఎత్తున చేపడుతున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో పనిచేస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకువస్తున్నాం. ఇన్నోవేషన్ వ్యాలీగా ఏపీనీ తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యార్ధులకు ప్రతిభ అవార్డులు ఇస్తున్నాం. జ్ఞానభేరి వంటి కార్యక్రమాలతో చైతన్యం తెస్తున్నాం. విద్యారంగంలో వినూత్న ఆవిష్కరణలు చేపడుతున్నాం. దేశంలో ఎక్కడా లేనట్టుగా వైద్యరంగంలో 24 పథకాలను పీపీపీ పద్ధతిలో అమలుచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఇ-ఔషధి, హెల్ అండ్ వెల్నెస్ సెంటర్లు, మహాప్రస్థానం, ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఈ- ఐ కేంద్రాలు, 108 బైక్ అంబులెన్సులు కొత్తగా ప్రవేశపెట్టామని అన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్ చేయడమే కాకుండా, నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే ఉచిత వైద్య పరీక్షలు చేసుకునేందకు వీలు కల్పించాం. 108 సర్వీసును సంస్కరించాం - 24 గంటలు అందుబాటులో 468 అంబులెన్సులు, దానికి తోడు కొత్తగా 177 ప్రైవేట్ అంబులెన్సులు, ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రాలు 115 ప్రవేశపెట్టాం. ప్రభుత్వాసుపత్రుల్లో సర్జరీలు పెరిగాయి. 2014-15లో 4.39 లక్షలు, 2018-19లో 11.99 లక్షల సర్జరీలు జరిగాయి. మలేరియా కేసుల తగ్గాయి. 2014లో 21,077 కేసులు వుంటే 2018లో 5,638 కేసులు నమోదయ్యాయి. కమ్యూనల్ డిసీజ్లు ప్రబలకుండా చర్యలు తీసుకున్నాం. అల్లూరి సీతారామరాజు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, గిడుగు రామ్మూర్తి పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, గురజాడ అప్పారావు, బాపు, ఘంటసాల వెంకటేశ్వరరావు, గుర్రం జాషువా జయంత్యుత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నాం. 641 సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు నాలుగేళ్లలో రూ.4.47 కోట్ల సాయం చేసాం. ఏడు అకాడమీలు తీసుకువచ్చాం. సంస్కృతి, సంప్రదాయాలు మన జీవితంలో భాగం కావాలి. భవిష్యత్లో మరింతగా మానవ వనరులపై శ్రద్ధ పెడతాం. మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. జనాభా నియంత్రణను ఒకప్పుడు ప్రోత్సహించాను. పది సంవత్సరాలలో మన రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. మళ్లీ ఇప్పుడు జనాభా సమతుల్యత అవసరం వచ్చింది. ఇప్పుడు అంతా సంపాదనపై దృష్టిపెట్టి, పిల్లల సంగతి మర్చిపోతున్నారు. మన రాష్ట్రంలో కూడా జనాభా పెరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదన్న నిబంధనను తొలగిస్తామని వెల్లడించారు. పట్టణీకరణ, అక్షరాస్యత అధికంగా ఉన్న చోట్ల సేవల రంగం వృద్ధి కనిపిస్తుంది. సేవల రంగం వృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో సేవల రంగం వాటా తక్కువుగా ఉంది. ఉత్తమ విద్య అందించాలంటే విద్యార్ధులపై ఒత్తిడి పెంచడం మార్గం కాదు. నాడు ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు స్థాపించడం వల్లే విదేశాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. విద్యార్ధులకు తరగతిలో భోదనతో పాటు క్షేత్రస్థాయిలో విజ్ఞానం సముపార్జించేలా చూడాలి. వ్యవసాయంపై రైతులు కూడా పీహెచ్డీ చేసేలా విద్యావిధానం ఉండాలి, విద్యార్ధులే పీహెచ్డీలు చేయాలన్న నియమం ఉండకూడదని అయన అభిప్రయపడ్డారు.