పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం వల్లంపట్ల, మల్లుకుంట గ్రామాల పంట పొలాలలో గత కొంత కాలం నుంచి చిరుత సంచరిస్తుందని గ్రామస్థులు హడలిపోతున్నారు. పోలం పనులకు వెళుతున్న రైతులు, కూలి పని చేసుకునే వారికి పులి కనపడిన దని ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు రైతులు భయభ్రాంతులకు తున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది, పోలీస్ అధికారులు పులి సంచరించిన ప్రదేశానికి వచ్చి పులి జాడలను పరిశీలించారు. అటవీ శాఖ పై అధికారులకు చేస్తామని, త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి జాడ తెలిసినట్లయితే బోనులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే చుట్టుపక్కల గ్రామాలలో గత కొంతకాలం నుంచి పులి పశువులను చంపి తింటుందని గ్రామస్తులు అంటున్నారు. అడవి జంతువును వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.