మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలను అధికారులు జప్తు చేశారు. వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆర్జించిన మొత్తంపై 2007-08కి సంబంధించి ఆయన రూ.18.5 లక్షల సేవా పన్ను చెల్లించాల్సి ఉందని హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ వెల్లడించారు. అప్పటినుంచి పన్ను కట్టకపోవడంతో అసలు, వడ్డీ, అపరాధ రుసుము కలిపి ఆ మొత్తం రూ.73.5 లక్షలకు చేరిందన్నారు. రాబట్టుకునేందుకు వీలుగా మహేష్‌బాబుకు చెందిన బ్యాంకు ఖాతాలను జప్తు చేశామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.