YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఉత్సాహాంగా ప్రారంభమైన జనవరి సిరీస్

ఉత్సాహాంగా ప్రారంభమైన జనవరి సిరీస్
డిసెంబరు సిరీస్‌ను ఓ మోస్తరు లాభాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. జనవరి సిరీస్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా లాభాలతో ఆరంభంకాగా.. నిఫ్టీ 10,800 మార్క్‌ వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో ఫార్మా, బ్యాంకులు, ఆటోమొబైల్స్‌ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు స్త‌బ్దుగా ఉన్నాయి. జ‌పాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు స్థిరంగా, నామ‌మాత్ర‌పు న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. ఇత‌ర సూచీలు ఒక మోస్త‌రు లాభాల‌తో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ప్రారంభ‌ం కావడం విశేషం.డాలరుతో రూపాయి మారకం విలువ బలపడి 70 దిగువకు చేరడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 322.76 పాయింట్ల లాభంతో 36130 పాయింట్ల వద్ద, నిఫ్టీ 99.45 పాయింట్ల లాభంతో 10879.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 40 పైసలు బలపడి 69.95 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో సన్ ఫార్మా, ఐవోసీ, జీ ఎంటర్‌టైన్, యూపీఎల్, యస్ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తదితర కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. 

Related Posts