మాజీ సీఎం జయలలిత మరణంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న అరుముగస్వామి కమిషన్ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంకు సమన్లు జారీ చేసింది. పన్నీరుసెల్వంతో పాటు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్‌కు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకు, లండన్ డాక్టర్ రిచర్డ్ బీలేకు కమిషన్ సమన్లు జారీ చేసింది. నోటీసులు అందుకున్న పన్నీరు సెల్వం జనవరి 8న, తంబిదురై జనవరి11న, డాక్టర్ రిచర్డ్ జనవరి 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, విజయభాస్కర్ జనవరి 7న ప్యానెల్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది. పన్నీరు సెల్వం, విజయభాస్కర్‌కు గతంలోనే సమన్లు అందినప్పటికీ వారు హాజరుకాలేదు.ఇదిలా ఉంటే.. జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలకు సంబంధించిన దర్యాప్తును అరుముగస్వామి కమిషన్ దాదాపుగా పూర్తి చేసింది.145 మంది డాక్టర్లను, పలువురు రాజకీయ నాయకులను, తమిళనాడు ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ రామ్‌మోహన్ రావును ఇప్పటికే కమిషన్ విచారించింది. 2016 డిసెంబర్ 5న జయలలిత అపోలో ఆసుపత్రిలో మరణించారు. సెప్టెంబర్ 25, 2017న రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుముగస్వామి నేతృత్వంలో జయలలిత మృతిపై కమిషన్ దర్యాప్తు మొదలైంది.