YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

1100 డయిల్ చేస్తే... రేషన్ కార్డ్...

1100 డయిల్ చేస్తే... రేషన్ కార్డ్...
కొత్త రేషన్‌కార్డుల కోసం తిరుగుతున్నారా... ప్రజాప్రతినిధులు, జన్మభూమి, గ్రామసభలో అర్జీలు ఇచ్చి అలసిపోతున్నారా..అయితే మీకు ఒక అవకాశం. 1100నంబర్‌ అన్‌లైన్‌ ద్వారా లబ్ధిపొందే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. మునుపు కొత్తగా కార్డులు ఇచ్చేవారికి వ్యవసాయభూములు, మోటరు వాహనాలు, ఉద్యోగం, రూ 500లు విద్యుత్‌ బిల్లులు చెల్లించేటట్లు ఉంటే రెవెన్యూ వారు రేషన్‌కార్డు ఇచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం పీపుల్‌ ఫస్ట్‌ 1100కు ఫోన్‌ చేస్తే కొత్త రేషన్‌ కార్డు పొందవచ్చు .నిబంధనల ప్రకారం అర్హత కుటుంబాలు కొత్తగా రేషన్‌కార్డు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాలు,ప్రజాప్రతినిధులు చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ఒకఫోన్‌కాల్‌తో కొత్త రేషన్‌కార్డు పొందవచ్చు. ప్రజాసాధికార సర్వే వివరాలను ఆధారంగా చేసుకుని రియల్‌టైమ్స్‌ గవర్నెన్స్‌(ఆర్‌టిజీ) 1100నెంబర్‌ అన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా ఎంపిక చేస్తుంది. తర్వాత రేషన్‌కార్డులు మండల కార్యాలయాల్లో పొందవచ్చు. జిల్లాలో ఈవిధంగా పేర్లు నమోదు చేసుకున్న పలువురకి నూతన రేషన్‌ కార్డులను గ్రామదర్శిని సంరద్బంగా అధికార్లు అందజేశారు. కొత్తరేషన్‌ కార్డుల జారీకి నిర్ణీత గడువు అంటూ లేదు. దీనిని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం మార్చింది. కొత్తకార్డులు కోసం దరఖాస్తు చేసి చాలాకాలమైంది. ఇంతవరకు మాకు రేషన్‌కార్డు రాలేదు. అన్ని అర్హతలు ఉన్నా కార్డు మంజూరు చేయరంటూ కొత్తరేషన్‌ కార్డుల మంజూరు విషయంలో చాలామంది నోటినుంచి ఇటువంటి మాటలే వస్తుండేవి. ఇంకాగ్రామ సభల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం ఆర్జీలు విపరీతంగా వచ్చేవి. వీటిని తహశీల్దార్‌ కార్యాలయంలో తీసుకుని గ్రామాలవారీగా క్రోడీకరించేవారు. తరువాత వీటిపై విచారణకు సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలనా బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు అప్పగించేవారు. కొత్తగా కార్డులు ఇచ్చేవారికి ఆరు అంశాలు పరిశీలించేవారు. వ్యవసాయభూములు, మోటరు వాహనాలు, ఉద్యోగం, రూ 500 విద్యుత్‌ బిల్లులు చెల్లించేవారికి రేషన్‌కార్డు రాదు. 
ఉమ్మడి కుటుంబ కార్డు విభజన పెళ్లై వేరు కాపురం పెట్టినవారు కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటివరకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న కార్డు నుంచి పేర్లను తొలగించుకోవాలి. ఈమేరకు రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యి కొత్తకార్డు మంజూరుకావడానికి ఏడాది సమయం పట్టేది. దీనివల్ల కొన్ని ప్రభుత్వ పథకాలకు వారు దూరమవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల కార్డులో పేర్లు లేకపోవడం, కొత్తకార్డు ఎంతకీ మంజూరుకాకపోవడంతో ఇళ్ల స్థలాలు, రాయితీ రుణాలు, వంటివి పొందలేకపోయేవారు. అయితే ఇకనుంచి ఈ పరిస్థితి ఉండదు. అర్హులైన వారికి కొత్తరేషన్‌కార్డులను ప్రభుత్వమే రాజధాని నుంచి నేరుగా మంజూరు చేస్తుంది. ఇందుకోసం 1100కుఫోన్‌ నంబర్‌ అందుబాటులో తీసుకువచ్చింది.ప్రభుత్వ నిబంధన ప్రకారం అర్హులై ఉండి నూతన రేషన్‌ కార్డు పొందేవారు నేరుగా పీపుల్స్‌ఫస్ట్‌ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి రేషన్‌ కార్డు కావాలన్న విషయాన్ని తెలియజేయాలి. అవతలి నుంచి దరఖాస్తుదారుని ఆధార్‌నంబర్‌ ఆడుగుతారు. ప్రజాసాధికారిసర్వేలో వివరాలు నమోది ఉంటే ఆధార్‌ నంబర్‌తో వారి వద్ద ఉన్న డేటా బేస్‌ను పోల్చి పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉంటే దరఖాస్తుదారుడికి కొత్త రేషన్‌కార్డు జారీచేయవచ్చని జాతీయసమాచార కేంద్రానికి వివరాలు పంపుతారు. ఎన్‌ఐసి నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా సంబంధిత జిల్లాకు ఈ వివరాలు వెళతాయి. ఇక్కడ నుంచి దరఖాస్తుదారుని మండలానికి పంపుతారు. ఈలోగా 1100 సిబ్బంది నూతన రేషన్‌కార్డు మంజూరైందని సమాచారం ఫోన్‌ ద్వారా లబ్ధిదారులకు తెలియజేస్తారు. అనంతరం సంబంధిత మండల కార్యాలయానికి నూతన కార్డువివరాలు పంపిస్తారు. లబ్ధిదారులు మండల కార్యాలయాలనికి వెళ్లి కొత్త రేషన్‌కార్డు తీసుకోవచ్చు . ఈవివారలు దరఖాస్తుదారుని ఫోన్‌కు పంపిస్తారు.

Related Posts