బావి తరాల భవిష్యత్ ను దృష్టిలోవుంచుకుని ప్రజలకోసం పోరాడేది జనసేన పార్టీ అని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ , జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖజిల్లా పాయకరావుపేట జాతీయ రహదారి వైజంక్షన్ వద్ద మనోహర్ కు స్థానిక జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఓ టీ దుకాణంవద్ద మనోహర్ చాయ్ త్రాగుతూ మీడియాతో ముచ్చటించారు. ఇటీవల టెక్నాలజీని వినియోగించి జనసేన పార్టీ నిర్వహించిన జనతరంగం కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతంగా పూర్తిచేసారన్నారు. ప్రతి ఇంటికి జనసేనపార్టీని తీసుకువెళ్ళే లక్ష్యంతో జనతరంగం నిర్వహిస్తున్నామన్నారు. తమపార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గ్లాజుగ్లాసు గుర్తును రానున్న కాలంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళతా మన్నారు. జనసేనపార్టీ 25 సవత్సరాల సుదీర్ఘ లక్ష్యాలతో ముందుకువెళుతూ ప్రజలకు అండగా నిలుస్తుందని మనోహర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనోహర్ వెంట జనసేన నాయకులు పసుపులేటి బాలరాజు,గెడ్డం బుజ్జి, కన్నబాబు, బోడపాటి శివదత్ తోపాటు పలువురు జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.