YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ

175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ
విశాఖలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత కె ఏ పాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ పోటి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది. గతంలో తెలంగాణలో భూస్థాపితం అవుతుందని నేనే చెప్పానని అన్నారు. మాతో ఎవరు కలిసి వచ్చిన వాడితో మేము కలిసి పనిచేస్తాం.  వివిధ పార్టీల నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు మహబూబ్ నగర్, ఒంగోలులో నాపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కేసులను మాఫీ కాకు౦డా ఆడుకుంటున్నాడని ఆరోపించారు. భీమవరం లో నా సభను చంద్రబాబు నాయుడు కావాలని అడ్డుకున్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన  హామీలన్నీ మోడీ చేస్తాడని ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఏ మీ అడిగిన నరేంద్ర మోడీ ఇవ్వలేదని అంటున్నారు. హామీలు చంద్రబాబు ఇచ్చాడా లేక మోడీ ఇచ్చాడా అని అడిగారు. పాలన చేసేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వండి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే  50% రైతుల రుణ మాఫీ చేస్తాం. ఐదేళ్లలో 100% చేస్తామని అన్నారు. 7 లక్ష ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా. పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధిని ఇస్తానని అన్నారు. శ్రీకాకుళం మత్స్యకారుల కోసం పాక్ ప్రధానితో మాట్లాడతా. నేరుగా నేను పాకిస్తాన్ కూడా వెళ్తాను. త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తానని అన్నారు. 

Related Posts