Highlights
- కర్ణాటకకు అనుకూలంగా తీర్పు
- కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు
- తమిళనాడుకు 177.25 టీఎంసీల నీరు
- కమల్ సానుకూల స్పందన
దశాబ్దాల పాటు సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంలో కర్ణాటకకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కొన్ని ఏళ్లుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల చిచ్చు రేగుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీల నీరు మిగలనుంది. ఈ తీర్పుతో తమిళనాడు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారువాటాలో 14.75 టీఎంసీల కోతను విధించి వాటిని కర్ణాటకకు ఇవివాదం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కమల్ స్పందన..
తమిళనాడు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో ఈ తీర్పుపై సానుకూలంగా స్పందించారు ఉలగనాయగన్ కమల్ హాసన్సానుకూలంగా స్పందించడం గమనార్హం. కావేరి జలాలపై సుప్రీం తీర్పు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కావేరి జలాలను రాజకీయం చేయొద్దని.. మనకు కేటాయించిన నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హితవు చెప్పారు. మరి కమల్ వ్యాఖ్యలపై తమిళనాడు వాసులు ఎలా స్పందిస్తారో చూడాలి.