అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న ‘గీత గోవిందం’ చిత్రం తరువాత రెండోసారి విజయ్ దేవరకొండతో జోడీ కడుతున్నారు. ఫైట్ ఫర్ వాట్ యు లవ్.. అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కాగా ‘డియర్ కామ్రేడ్’ ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రెండు నెలల పాటు జరిగిన తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్ అతి పెద్దది కావడంతో విశేషం. ఇన్ని రోజుల పాటు కాకినాడలో ఉండటంతో ఇక్కడి ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు విజయ్ దేవరకొండ. ఇక్కడ షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలతో పాటు పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘గత రెండు నెలలుగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటున్నా. నెల రోజుల నుండి కాకినాడలోనే ఉండటంతో సడెన్‌గా హైదరాబాద్ వెళ్లాలంటే ఏదోలా ఉంది. నా ఫ్రెండ్ చెల్లెలు వాళ్ల కుటుంబ సభ్యులు నేను ఇక్కడ నుండి వెళ్తున్నా అంటే కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా అటాచ్ ఏర్పడింది కాకినాడ ప్రజలతో. ఇక్కడ మంచి వాతావరణం ఉంది. మంచి ఫుడ్ దొరికింది. జగన్నాధపురంలో ప్రత్యేకంగా సెట్ వేసి షూట్ చేశాం. కాకినాడ జనంతో మా స్క్రీన్ కళకళలాడింది.