మొదటి నుంచి పేద మధ్య తరగతి కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఆసరా ఇస్తోందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు డివిజన్లోని శివాజీ నగర్ మల్లెడ గుంట వాసులు 21 మందికి తన కార్యాలయంలో శనివారం పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శివాజీ నగర్ లోని పేదలు సంచార జీవులు వారి స్థిర నివాసం కోసం మేము ఇప్పుడు పట్టాలను మంజూరు చేయించాం. త్వరలో ఇల్లుకూడా హరి రెడ్డి ఆధ్వర్యంలో కట్టిస్తాం. నెల్లూరు నగరంలో 40 వేల మంది పైచిలుకు ప్రజలకు ఇల్లు కట్టించాం. మరికొంతమందికి ఇళ్లస్థలాలు ఇచ్చాం. జనవరిలో కోడూరుపాడు జరిగే జన్మభూమి కార్యక్రమంలో రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నామని అన్నారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేశాం. నగరంలో రూరల్ పరిధిలో ప్రతి చోట సిసి రోడ్లు వేసాం. నగరంలో మంచినీటి వసతి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే ఇబ్బందులు తీరనున్నాయి నెల్లూరు చెరువు కట్ట అందంగా తీర్చిదిద్ది హాయిగా కూర్చునే గడిపే విధం గా మార్చనున్నాం గతంలో 70 ఏళ్లుగా జరగని అభివృద్దిని ఇప్పుడు చేసామని అన్నారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు ప్రజలు మమ్మల్ని సీఎం చంద్రబాబు ని ఆశీర్వదించాలి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య ఖాజావలి కోడూరు కమలాకర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిరమన శ్రీనివాసులురెడ్డి హరి రెడ్డి హరి శివారెడ్డి పాముల హరి మాతంగి కృష్ణ జీవన్ ప్రసాద్ నరసింహ రావు శశిధర్ సతీష్ పులిమి శైలజా రెడ్డి అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్వర్ణ వెంకయ్య అధ్యక్షత వహించారు