Highlights
- గీతాంజలి జెమ్స్ పార్క్‌పై ఈడీ సోదాలు
- రూ.3 వేల కోట్ల వజ్రాలు స్వాధీనం
- కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
నగరంలోని గీతాంజలి జెమ్స్ పార్క్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం రంగంలోకి ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గీతాంజలి జెమ్స్ యజమాని మెహిల్ ఇంట్లో, ఆఫీసులోనూ ఏకం కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇతను పంజాబ్ నేషనల్ స్కామ్‌లో నిందితుడు కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. కాగా ఇప్పటికే మెహిల్‌పై పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసింది. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎఫ్ఐఆర్‌కు ముందే నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం జెమ్స్ కంపెనీని నీరవ్ మోడీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
రూ 11,000 కోట్ల భారీ అవకతవకల్లో మరో మూడు బ్యాంకులు
గత దశాబ్దకాలంగా గీతాంజలి బిజినెస్ నిర్వహిస్తోంది. హైదరాబాద్, ముంబై, సూరత్‌లలో వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, సూరత్‌లో డైమండ్స్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రముఖులకు నగలు, వజ్రాలు తయారీలో గీతాంజలి పేరుగాంచింది.
ఆ బ్యాంక్ మోసపూరిత లావాదేవీలకు నెలవు
ప్రపంచ వ్యాప్తంగా వీఐపీలే గీతాజంలి కస్టమర్లున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.