అక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా ట్రైలర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా ఉంది. ప్రపంచంలో ఉన్న ఆర్ధిక నిపుణుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 4 శాతం పడిపోయిన దేశ జీడీపీ 7 శాతంకు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ది. రుణమాఫీతో పాటు అనేక కీలక చట్టాలను మన్మోహన్ సింగ్ తన పాలన సమయంలో తెచ్చారు. మన్మోహన్ సింగ్ అక్సిడెంటల్ ప్రధాని కాదని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ప్రధాని పదవి కాదు కదా...కేంద్ర మంత్రి పదవి కూడా వద్దని..తాను ఇంకా నేర్చుకోవాలని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. అనూపమ్ ఖేర్ మోడీ ప్రభుత్వం లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ చైర్మన్ గా పని చేశారు. ఆయన భార్య కిరణ్ ఖేర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి సినిమాలు తెస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓటమి ఎదురుకావడంతోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పైన కుట్రతో ఈ సినిమా తీస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం ఏ మాత్రం ఉండదు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విభజన హామీలు అమలకు ఇప్పటికే ఆలస్యం అయిందని అన్నారు. హైకోర్టు విభజన వ్యకుల కోసం జరగదు. హైకోర్టు విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అయన అన్నారు.