తిరుమల శ్రీవారి దర్శనార్థం డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేయడం జరిగింది.
ఈ రెండు రోజుల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ఉండదు. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. జనవరి 2వ తేదీ నుండి యథావిధిగా ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయి. భక్తులు ఈ విషయాలను గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.