Highlights
- 1రోజు వాలిడిటీతో అపరిమిత కాలింగ్
- 4జీ స్పీడ్ తో 100ఎంబి డేటా
- జియోకు కౌంటర్‌గా.. ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్
వినియోగదారులను ఆకర్షించడానికి, తమ వినియోగదారులను కోల్పోకుండా ఉండటానికి ఆయా టెలికం సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. .తాజాగా ఎయిర్ టెల్ రూ.9 ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో 1రోజు వాలిడిటీతో వినియోగదారులు అపరిమిత కాలింగ్ (లోకల్, ఎస్‌టీడీ మరియు రోమింగ్) తో పాటు 4జీ స్పీడ్ తో 100ఎంబి డేటాను పొందుతారు. అలాగే 100 లోకల్, నేషనల్ మరియు రోమింగ్ ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.ఈ ప్యాక్‌లో అదనంగా 100 ఎంబీ, 100 ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న ఆఫర్ రూ.19 ప్లాన్ (అన్‌లిమిటెడ్ కాల్స్, 20 ఎస్ఎంఎస్, 150ఎంబీ డేటా)కు కౌంటర్‌గా భారతీ ఎయిర్‌టెల్ ఈ రూ.9 రీచార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఈ కొత్త రీచార్జ్ ప్యాక్‌తో పాటు రూ. 23 ప్లాన్‌ను కూడా రెండు రోజుల కాలపరిమితిపై తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా (లోకల్, ఎస్టీడీ, రోమింగ్) కాల్స్‌తోపాటు 200 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తోంది. రూ. 9 రీచార్జ్ ప్యాక్ పొందాలనుకునే ఎయిర్‌టెల్ యూజర్లు కంపెనీ మొబైల్ ఆప్లికేషన్ లేదా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. కోంబో ఆఫర్ సెక్షన్ కింద రీచార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంది.