ఆసీస్తో బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 137 పరుగుల తేడాతో గెలుపొందింది. 399 పరుగుల లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 261 పరుగులకే ఆలౌటైంది.258/8 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన కొద్దిసేపటికే కమిన్స్ (63), లైయన్ (7) ఔటవ్వడంతో భారత్ విజయం లాంఛనమైంది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి.. షమీ, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు. నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.