టీఆర్ఎస్ తరపున ఎన్నికైన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేు గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండం గామాపాడు గ్రామంలో వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య ఆధ్వర్యంలో నేడు కార్యక్రమం జరుగుతోంది. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా పల్నాడులోని యాదవులను ఏకంచేసే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చితీరుతా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ చేస్తుంటే, మరోవైపు ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వైసీపీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.