తెలుగు, తమిళ బాషలలో వరుస విజయాల తో దూసుకుపోతుంది సాయి పల్లవి. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి అంటోంది.తనకు లివింగ్ టుగెదర్ సంబంధం వద్దని అంతమాత్రాన సహజీవనానికి వ్యతిరేకినని చెప్పబోవడం లేదని అంది. తాను వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని చెప్పింది.