ఏపీలో సచివాలయం నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, తనపై విశ్వాసంతోనే వారు ఇచ్చిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ విషయమై కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, దీని నిర్మాణానికి రూ.250 కోట్లు అయితే సరిపోతుందంటున్న ఆయన ఇంటికి మాత్రం రూ.300 కోట్లు కావాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయం సెక్రటేరియట్ అని, దాన్ని చూడగానే గౌరవం కలిగేలా ఉండాలని అన్నారు.