రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సహాయంతో మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్ నెలకొల్పడానికి సిఆర్జెడ్ క్లియరెన్స్ వచ్చిందట. అన్ని సర్వేలు అయిపోయినాయి. దీనివలన మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమంది మత్స్యకారులకు చాలా ఉపయోగం జరుగుతుంది. ఎప్పు డూ బందరు కాలువ సముద్రంలో కలిసే చోట మోగా ఏర్పడి , మత్స్యకారులు సముద్రం పై కి వేటకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రతిపాదనలో ఒక డ్రెడ్జర్ కూడా ఉండటం వలన, మచిలీపట్నం మత్స్యకారుల అందరికీ మోగ సమస్య తీరుతుంది. అలాగే ఫిషింగ్ హార్బర్ వలన అనేక మంది మత్స్యకార యువతకు జీవనోపాధి కూడా కలుగుతుంది. కావున ఈ ప్రతిపాదనకు ఈసీ క్లియరెన్స్ ఇప్పిస్తే మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులకు సహాయంగా ఉంటుంది.