డీఎస్సీ 2018 తుది కీ జనవరి 7న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటివరకూ నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్) పరీక్షల మాస్టర్ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు పరీక్షలు రాసిన అభ్యర్థులు జనవరి 2 సాయంత్రం 5 గంటల లోపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. అభ్యంతరాలు ఆన్‌లైన్‌లో మాత్రమే నమోపదు చేయాలని, వ్యక్తిగతంగా స్వీకరించరని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు 1.3 లక్షల మంది దరఖాస్తు చేయగా, 1.18 లక్షల మంది (90.46) మంది పరీక్షకు హాజరయ్యారు