YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పోత్తుపై బాబు నిర్ణయమే కీలకం

ఏపీలో పోత్తుపై బాబు నిర్ణయమే కీలకం
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు సమాచారం. ‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీచేస్తే మీకు లాభమనుకుంటే అలాగే వెళ్దాం. ఎవరికి వారు విడిగా పోటీ చేయడం మంచిదనుకుంటే అదే చేద్దాం. ’ అని ఆయన చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకుని అన్ని బీజేపీయేతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాహుల్‌తోనూ చర్చించారు. తర్వాత కూడా ఫోన్లో ఇరు పక్షాల మధ్య రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల్లో పెద్దదైన కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్తేనే కూటమి బలంగా ఉంటుందని.. ఆ పార్టీ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏర్పడితే దానికి ప్రజల్లో విశ్వసనీయత ఉండదని మిగిలిన అన్ని ప్రాంతీయ పార్టీలకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్‌ పట్ల అభ్యంతరాలున్న పార్టీల నేతలకు.. కాంగ్రె్‌సకు మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పరిచే బాధ్యత కూడా కొంత వరకూ ఆయనే తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష కూటమి నిర్మాణ బాధ్యతను ఆయన మరి కొంతముందే తీసుకుని ఉంటే ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీఎస్పీల మధ్య పొరపొచ్చాలు వచ్చి ఉండేవి కావని ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరగడానికి తాను ఆదర్శంగా ఉండాలన్న అభిప్రాయంతో చంద్రబాబు తెలంగాణలో ముందు నుంచే జాగ్రత్త పాటించారు. మరీ ఎక్కువ సీట్లు అడగకుండా ఒక పరిమితికి లోబడి తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. కాని అక్కడ ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు.తెలంగాణా సీట్ల సర్దుబాటులో చంద్రబాబు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం కాంగ్రెస్‌ నేతలకు కూడా బాగా సంతోషం కలిగించింది. దీంతో ఆయన పట్ల కాంగ్రెస్‌ అధిష్ఠానం బాగా సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమి నిర్మాణానికి ఆయన అవసరం చాలా ఉందని, అందరినీ ఏకతాటిపైకి తేగలిగిన చాతుర్యం ఆయనకు ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. రాష్ట్రాల్లో ఏది పెద్ద పార్టీ అయితే ఆ రాష్ట్రంలో దానికి పెద్దన్న పాత్ర ఇవ్వాలని, సీట్ల సర్దుబాటుపై నిర్ణయాధికారం ఆ పార్టీకే ఉంటే సమస్యలు తగ్గుతాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనిపై మిగిలిన పార్టీ

Related Posts