తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకా కేంద్రం ఏటు వంటి సహయం లేక పోయినా చాల అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసాం. ఎన్నికల్లో ఇచ్చిన మానిఫేస్టో లో హామీలు పూర్తి చేసాం. మానిఫేస్టో లో ఇచ్చిన హామీలు మళ్ళీ ఒక సారి పరిశీలించి వచ్చే ఎన్నికల్లో కి కార్యాచరణ చేపడుతున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. త్వరలో 8 వేల కోట్ల రూపాయిలు రైతు రుణ మాఫీ చేస్తున్నాం. మహిళలకు సంబందించిన డ్వాక్రా రుణమాఫీ 1000 కోట్లు మాఫీ చేస్తూన్నాం. మానిఫేస్టో లో లేని పోలవరం పురుషోత్తమ పట్నం ప్రోజేక్ట పూర్తి చేస్తున్నాం. ఆదాయం పెరుగుతున్నప్పట్టికి సంక్షేమ కార్యక్రమలు పెరగడంతో ఇంకా అప్పులు చేయ్యవలసి వస్తుందని అయన అన్నారు. ఇప్పుడు తక్కువ వడ్డీ లో రుణాలు వస్తున్నాయి. పురుషోత్తపట్టణం, పట్టిసీమ ప్రోజేక్టులు త్వరలో ముఖ్యమంత్రి చే ప్రారంభిస్తామని అయన అన్నారు.