
మితిమీరిన అతివేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. గుంటూరు లాలుపురం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు ఆర్వి ఆర్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా కాలేజీ నుంచి విజయవాడకు బయలుదేరారు. కారును గంటకు 170కిలోమీటర్ల వేగంతో నడుపుతూ వచ్చారు. లాలుపురం జాతీయ రహదారిపై రాగానే కారు అదుపు తప్పింది. మొదట డివైడర్ ను ఢీ కొట్టింది. వెంటనే కారు వెనుక వస్తున్న మున్సిపల్ లారీ కిందకు దూరి పోయింది. లారీని కుడా అదే వేగంతో రోడ్డుపై ఇడ్చుకుపోయింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మిగతావారికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సేకరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు కాలేజ్ యాజమాన్యం ద్వారా సమాచారం అందించారు.మృతులు గుంటూరు జిల్లా అమరావతి కమ్మంపాడుకు చెందిన వారు.