Highlights
- యాపిల్ ను ఆటాడుకుంటున్న 'ఙ్ఞా; అక్షరం
ఒక చిన్న తెలుగు అక్షరం ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజయాపిల్ ను ఓ కుదుపు కుదిపింది. తాజాగా ఓ తెలుగు అక్షరం ఐవోఎస్ సాఫ్ట్‌వేర్‌కు దడపుట్టిస్తోంది. ఐవోఎస్ 11.2.5 వాడుతున్న ఫోన్లలో మెస్సేజింగ్ యాప్, వాట్సాప్, ట్విటర్ వాడుతున్న వారు ‘జ్ఞా’ అక్షరాన్ని టైప్ చేసి పంపేందుకు యత్నిస్తే ఆ యాప్ క్రాష్ అవుతోంది. అప్పుడప్పుడూ ఐవోఎస్ సాఫ్ట్‌వేర్ కూడా క్రాష్ అయిపోతోంది. స్ప్రింగ్‌లోడింగ్ డిస్‌ప్లేతో మొత్తం బ్లాక్ అయిపోతోంది. ఇటలీకి చెందిన మొబైల్ వరల్డ్ అనే ఓ బ్లాగ్ దీన్ని గుర్తించింది. ఇది ఐవోఎస్ కొత్త బగ్. భారతీయ భాషకు సంబంధించిన అక్షరం ఐఫోన్‌లోని యాప్స్‌ను లేదా ఏకంగా ఫోన్‌నే క్రాష్ చేస్తోంది. వాట్సాప్ సహా అన్ని మెస్సేజింగ్ యాప్‌లను ఇది డిసేబుల్ చేస్తోందంటున్నారు. ఒకవేళ ఈ అక్షరం నోటిఫికేషన్‌గా వస్తే దాన్ని డిలీట్ చేయాల్సిందిగా పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు.యాపిల్ దాన్ని పరిశీలించి ఫిక్స్ చేసే పనిలో ఉంది. అయితే ఐవోఎస్ 11.3లో దీన్ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఐవోఎస్ 11.2 వాడుతున్న వారు 11.3 అప్‌డేషన్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.