YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

పసిడి డిమాండ్ తగ్గుముఖం

పసిడి డిమాండ్ తగ్గుముఖం
భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. చేతిలో డబ్బులుంటే చాలు.. బంగారం కొంటుంటారు. అయితే గ్రాము బంగారం కొనాలంటే కనీసం మూడు వేలు కావాలి. అదే పది గ్రాములకు రూ.30 వేలకు పైనే కావాలి. ఒక్కొక్కసారి ఇంత డబ్బు మన వద్ద ఉండకపోవచ్చు. అందువల్ల బంగారం కొనలేకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేదు. రూపాయి కూడా బంగారం కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. పలు ఆన్లైన్ ప్లాట్ఫ్లామ్స్ ఈ సేవలందిస్తున్నాయి.బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అయితే ఇటీవల మన దేశంలో పసిడి డిమాండ్ తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ రిటైలర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన ఆఫర్లతో ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే రూపాయికి కూడా బంగారాన్ని కొనే వెసులుబాటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వపు విధానాలు, దేశీయంగా ధరలు ఎక్కువగా ఉండటం, యువతకు బంగారంపై ఆసక్తి లేకపోవడం వంటివి పసిడి డిమాండ్ తగ్గుదలకు కారణాలుగా ఉన్నాయి. దీంతో జువెలర్లు కూడా ఆన్లైన్ బాటపట్టారు. చాలా మంది రూపాయికే బంగారాన్ని కొంటున్నారని డిజిటల్ ప్లాట్ఫామ్ సేఫ్గోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ మాథూర్ తెలిపారు. సేఫ్గోల్డ్ రూపాయికి కూడా బంగారాన్ని విక్రయించేందుకు ఫ్లిప్కార్ట్కు చెందిన పేమెంట్స్ యాప్ ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూపాయి చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేస్తే.. రూపాయికి సమాన విలువైన బంగారం మన ఖాతాకు వచ్చి చేరుతుందని గౌరవ్ మాథూర్ తెలిపారు. అలా మన ఖాతాలోని బంగారం ఒక గ్రాముకు సమానమైన తర్వాత డెలివరీ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం బంగారం ధర రూ.3,200కు అటుఇటుగా ఉంది. రూపాయికి కూడా కొనుగోలు చేయడం, వేగవంతమైన లావాదేవీలు వంటివి ఆన్లైన్ బంగారం కొనుగోలుకు సానుకూల అంశాలని గౌరవ్ మాథూర్ తెలిపారు. అదే సాంప్రదాయ మార్కెట్లో బంగారం కొనుగోలు చేయాలంటే కనీసం ఒక గ్రాము కొనాల్సి ఉంటుందన్నారు.

Related Posts