నూతన ఏడాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మద్దతుతో నేను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయబోతున్నాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలో వెల్లడిస్తాను.’’ అని ట్వీట్ చేశారు.