YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు బంధు గణం సపోర్ట్ కోసం వెంపర్లాట

చంద్రబాబు బంధు గణం సపోర్ట్ కోసం వెంపర్లాట
రాజ‌కీయాల్లో ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవాలి. స్నేహితులు కావొచ్చు.. బంధువులు కావొచ్చు.. ఎవ‌రైనా కావొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌స్తుందో చెప్ప‌లేం. రాజ‌కీయాల్లో ఎంత‌సేపూ స్నేహితులు… సీనియర్లే కాదు.. బంధువులు కూడా చాలా ముఖ్యం. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. అక్క‌డ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. విజ‌యం వెనుక కుటుంబ స‌భ్యుల బ‌లం ఎంతో ఉంది. ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని నిర్ణ‌యించు కోవ‌డానికి ముందుగానే .. తెలంగాణా సార‌థి కేసీఆర్ త‌న రాజీక‌య కుటుంబాన్ని స‌మావేశ ప‌రిచి వ్యూహాల‌ను సిద్ధం చేసుకున్నారు. కుమార్తె, మేన‌ల్లుడు, కుమారుడు ప్ర‌త్య‌క్షంగా పైకి క‌నిపిస్తున్నారు.కేసీఆర్ విజ‌యానికి బంధుగ‌ణం బాగానే ప‌ని చేసింది. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. అధికార పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగానే ఆయ‌న త‌న కుమారుడు నారా లోకేష్‌ను పార్టీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని చేయ‌డం చాలా క‌లిసి వ‌చ్చిం ది. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని తెలుసుకుని బాబుకు చెప్పేందుకు లోకేష్ బాగానే కృషి చేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రిగా మ‌రింత చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య కూడా పార్టీకి చాలా మేర‌కు ఉపయోగ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌ల్లో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను సింహ‌భాగం బాల‌య్య త‌న భుజాల‌పై వేసుకుని బాబుకు సాయ ప‌డ్డారు.గెలుపు ఓట‌ములు అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయాల్లో కుటుంబ స‌భ్యుల ప్ర‌మేయం అనేది నేడు స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ప్ర‌ధానంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో పార్టీలు కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో చంద్రబాబునాయుడు ఇప్పుడు మరోసారి కుటుంబ సభ్యుల మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలోకి దింపాలన్నది చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తన అక్క సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గంలో పోటీ చేసినా ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కేవలం ట్విట్టర్ ద్వారానే తన అక్క గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నందమూరి కుటుంబం నుంచి బాలయ్య ఎటూ ప్రచారంలో ఉంటారు. కానీ జూనియర్ ను ఎలా ప్రచారంలోకి తీసుకురావాలన్న దానిపైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టారంటున్నారు. నందమూరి బాలకృష్ణ ద్వారా రాయబారం పంపి జూనియర్ ను ఒప్పించాలన్నది బాబు ఆలోచనగా ఉందంటున్నారు. సుహాసిని ఓటమిపాలవ్వడంతో హరికృష్ణ కుటుంబసభ్యులు ఇంకా తేరుకోలేదు. జూనియర్ కూడా సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో వచ్చే జనవరిలో జూనియర్ తో మాట్లాడించాలని బాబు డిసైడ్ అయ్యారు. సాధారణంగా సంక్రాంతి పండగకు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామమైన నారావారి పల్లెకు వెళతారు. అక్కడే మూడు రోజులు ఉండి పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా హరికృష్ణ కుటుంబ సభ్యులందరినీ నారావారా పల్లెకు ఆహ్వానించాలని బాబు భావిస్తున్నారు. పవన్ ను ధీటుగా ఎదుర్కొనాలంటే జూనియర్ ను రంగంలోకి దించాలన్న బాబు లక్ష్యం నెరవేరుతుందో? లేదో? చూడాలి.

Related Posts