YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాలుగున్నర ఏళ్ల తర్వాత అడుగులు

 నాలుగున్నర ఏళ్ల తర్వాత అడుగులు
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యానికి, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు మ‌ధ్య ఎక్క‌డా పొంత‌న ఉండ‌డం లేద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌. ఇక్క‌డ నిజంగానే అభివృద్ది జ‌రిగింద‌ని ఎలా చెబుతారు? అని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామంటూ వివిధ దేశాల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో పలు దఫాలుగా పర్యటించారు. ఆయన ఎక్కడకు వెళితే ఆ ప్రాంతం మాదిరి గా రాజధానిని కడతానంటూ ప్రకటించినా కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో సెట్టింగ్‌లతో సర్కారు సిద్ధమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంతవరకూ ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేసేందుకు ఉపక్రమించ‌డం మొద‌టికే మోసం వ‌చ్చే ఛాన్స్ లేక‌పోలేద‌ని అంటున్నారు. నాలుగున్నరేళ్లుగా రాజధాని అమరావతికి ఒక్క ఇటుక కూడా వేయకుండా డజన్ల కొద్దీ గ్రాఫిక్స్, భారీ వ్యయంతో తాత్కాలిక కట్టడాలు, కబుర్లతో కాలక్షేపం చేసి, ఎన్నికలకు రెండు నెల ల ముందు మరో డ్రామాకు తెర తీశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈసారి సినీ దర్శకులను తలదన్నేలా అదిరి పోయే స్కెచ్‌ గీసింది. దాదాపు రూ.45 కోట్ల భారీ వ్యయంతో మినీ రాజధాని ఊహాచిత్రాన్ని సినిమాల తరహాలో సెట్టింగ్‌లతో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. సందర్శకులను ఆకట్టుకునేందుకు స్టార్టప్‌ ఏరియా ప్రాంతంలో వెల్‌కమ్‌ గ్యాలరీ పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని ఎలా ఉంటుందో చెప్పేందుకు కేవలం గ్రాఫిక్స్‌ సరిపోవని, మయ సభ లాంటి సెట్టింగ్‌లే సరైన వనే నిర్ణయానికి సర్కారు వచ్చింది. ఈ సెట్టింగ్‌లు రూపొందించే కన్సల్టెంట్లకు మరో రూ.43 లక్షల దాకా ఫీజు చెల్లించేం దుకు సిద్ధపడటం గమనార్హం. ఇప్పుడు ఈ ప‌రిణామం అటు తిరిగి ఇటు తిరిగి సోష‌ల్ మీడియాకు చేరింది. ఇంతింత ఖర్చు ధార‌పోసి డిజైన్లు సృష్టించాలా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌ధాని పూర్తి చేయ‌లేక పోయినంత మాత్రాన ఇదే విష‌యాన్ని క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లి జ‌రిగిన విష‌యాన్ని చెప్పి. వారి నుంచి సానుభూతి పొందితే ఇబ్బందులు ఉండ‌వ‌ని, కాని, ఇలా అయిందానికి కాని దానికి కూడా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ధార‌పోస్తే.. ఆర్థికంగా న‌ష్టాలు రావ‌డంతోపాటు ఓట్లు కూడా రాల‌తాయ‌నే న‌మ్మ‌కం లేదుక‌దా ?! అంటున్నారు పోల‌వ‌రం ప్రాజెక్టు పురోగ‌తి సెంటిమీట‌రు ప‌నులు జ‌రిగితే ఏకంగా కిలోమీట‌ర్ల మేర ప్ర‌చారం చేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అక్క‌డ ఇంకా గేట్ల బిగింపు ప్రక్రియ స్టార్ట్ కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్ర‌తి రోజు బ‌స్సులు పెట్టి మ‌రీ ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించి ఆహో ఓహా అనే రేంజ్‌లో ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రాజ‌ధాని విషయంలోనూ అలాగే అన్ని జిల్లాల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించాల‌ని చూస్తున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసింది త‌క్కువ ప్ర‌చారం ఎక్కువ అన్న చందానే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

Related Posts