అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రభావంతో.. దేశీయంగా పెట్రో ధరలు మరింతగా తగ్గుతున్నాయి. దీంతో కొత్త సంవత్సరం మొదటిరోజును కూడా వాహనదారులకు ఊరట కల్పిస్తూ పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా తగ్గాయి. మంగళవారం దేశరాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర 19 పైసలు తగ్గి రూ.68.65 కి చేరగా.. డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ.62.66 కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో 17 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.74.30 కి చేరగా.. డీజిల్ ధర 20 పైసలు తగ్గి 65.56 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.72.82 వద్ద, డీజిల్ ధర 21 పైసలు తగ్గి రూ.68.11 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.38 ఉండగా, డీజిల్ ధర రూ.67.34 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 53.80 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 45.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది.