గతేడాది నవంబర్ 29న గుజరాత్ దగ్గర సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్కు బందీలైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. ఆ 22 మంది మత్స్యకారులను విడిపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు విడివిడిగా లేఖలు రాసారు. పొట్టకూటి కోసం గుజరాత్ వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారని, వారిపై దయ చూపాలని లేఖలో అయన పేర్కోన్నారు. మత్స్యకారుల కుటుంబాలు అనాథలు అయ్యాయని అయన అన్నారు. ఇప్పటికే 22 మంది మత్స్యకారులకు చెందిన 11 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.22 లక్షలు సాయం అందింది.