YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోడెల కార్యాలయంలో వేడుకలు

కోడెల కార్యాలయంలో వేడుకలు
రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన సంవత్సరంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది. 47లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. మంగళవారం నాడు అయన తన క్యాంపు ఆఫీసులో అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి నూతన యేడాది వేడుకలు జరుపుకున్నారు. కోడెల మాట్లాడుతూ చంద్రన్న భీమా, పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ ఇలా ఎన్నో చేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయినప్పుడు పోరాటం చేశాం. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో అభివృద్ధి, సంక్షేమం వైపు దూసుకెళుతున్నాం. ప్రత్యేకంగా వ్యవసాయ దారులకు పూర్తిగా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. రుణమాఫీ, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ యంత్రాలు, భూ పరీక్షలు ఇలా ఎంతో చేస్తుందని అన్నారు. మహిళలు డ్వాక్రా రుణాలతో పాటు... వారు ఆర్థికంగా ఎదగడానికి చేయూతనివ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో దళితుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గ్రామాల్లో నడిబొడ్డున ఎలాంటి అభివృద్ధి జరిగిందో దళితులు ఉండే ప్రాంతాల్లో అదే అభివృద్ధి. 70కోట్లతో సాగర్ కాలువ అభివృద్ధితో పాటు, 6020కోట్లతో గోదావరి, పెన్నా కలయికి నకరీకల్లు వద్ద శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. పార్టీకి గుండెకాయ అయినా బీసీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అండతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అధికారులు, నాయకులు పూర్తి సహకారం అందించారు. మనం చేసిన అభివృద్ధితో రానున్న రోజుల్లో పూర్తి మోజార్టీ సాదించాలి్. గతంలో రౌడీ రాజ్యంగా ఉన్న నరసరావుపేట, సత్తెనపల్లిలో 0శాతం క్రైమ్ సాధించామని అన్నారు. గోదావరి, పైన్నా అనుసంధానంలో భాగంగా ఏ ఒక్క రైతులకు నష్టం కలగనీయం. రానున్న రోజుల్లో నరసరావుపేట, సత్తెనపల్లి మరింత అభివృద్ధి చేసుకుందామని అయన అన్నారు. 

Related Posts