YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి పితాని నివాసంలో నూతన సంవత్సర వేడుకలు

మంత్రి పితాని నివాసంలో నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సరంలో ప్రజలు అందరూ  అభి వృద్ది వైపు పయనిస్తు అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ చిరునవ్వులతో జీవించాలని రాష్ట్ర కార్మిక, ఉపాథా కల్పనా శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాల లోని మంత్రి  స్వగృహంలో  మంగళవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలలు నుండి అధికారులు,  అనధి కారులు,  ప్రజాప్రతి నిధులు.  విద్యార్ధిని విద్యార్ధులు, మహిళలు చిరు ఉద్యోగులు, పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఉత్తున తరలి వచ్చి మంత్రికి శాలువాలుతో, బోకేలు పూలదండలు, కేకులు, జ్ఞపికలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంఘలు,సంస్థలు ముద్రించిన 2019 సంవత్సర క్యాలెండర్లను మంత్రి అవిష్కరించారు. కొంత మంది చిన్నారులు మంత్రితో సెల్ఫిలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ అన్నిరంగాల్లో ముందుకు వెళ్లాని  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుకోవాలని అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జేట్ ఉన్నా, సంక్షేమం అభివృద్ది సమపాలన అందిస్తు ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అన్నారు.
దేశ భావిష్యత్తు యువత చేతిలో ఉందని,  ప్రపంచ పోటీతత్వానికి అనుగుణంగా యువత ప్రావీణ్యత సాధించి తల్లి తండ్రుల ఆశాయాలను నేరవెర్చి దేశానికి, రాష్ట్రనికి సేవలు అందించాలని మంత్రి అన్నారు. 

Related Posts