YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాలతో మార్కెట్లు

లాభాలతో మార్కెట్లు
కొత్త సంవత్సరాన్ని దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్‌ 93 పాయింట్ల లాభంతో 36,162 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10,882 పాయింట్ల వద్ద మొదలైంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ, ఆటోమొబైల్‌ తదితర రంగాల షేర్లలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కోలుకున్న మార్కెట్లు చివరకు మంచి లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 186.24 పాయింట్ల లాభంతో 36,254.57 వద్ద ముగియగా, నిఫ్టీ 47.55 పాయింట్ల లాభంతో 10,910.10 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు కూడా పుంజుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 69.68 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ (+2.24), హెచ్‌డీఎఫ్‌సీ (+2.07), హెచ్‌పీసీఎల్ (+1.36), యస్ బ్యాంక్ (+1.35), భారతీ ఇన్‌ఫ్రాటెల్ (+1.25) తదితర షేర్లు లాభపడగా.. మహింద్రా & మహింద్రా (-3.79), హిండాల్కో (-1.53), విప్రో (-1.27), ఇండియాబుల్స్ హౌసింగ్ (-1.07), హెచ్‌యూఎల్ (-1.02) తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి 
15 రోజుల  స్టాక్ మార్కెట్లకు పండుగ సెలవులు
ముంబై, జనవరి 1
మనకే కాదండోయ్.. స్టాక్ మార్కెట్‌కు కూడా సెలవులు ఉంటాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు సాధారణంగా వారానికి ఐదు రోజులు  పనిచేస్తాయి. సెలవు రోజుల్లో మార్కెట్లు కూడా పనిచేయవు. కొత్త ఏడాది 2019లో స్టాక్ మార్కెట్ మొత్తంగా 15 రోజులు పనిచేయదు. ఆ రోజులు ఏంటో చూద్దాం.. 
 
2019 స్టాక్ మార్కెట్ సెలవులు
1 మహా శివరాత్రి మార్చి 4 సోమవారం
2 హోలి మార్చి 21 గురువారం
3 మహవీర్ జయంతి ఏప్రిల్ 17 బుధవారం
4 గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 19 శుక్రవారం
5 మహరాష్ట్ర దినోత్సవం మే 1 బుధవారం
6 రంజాన్ జూన్ 5 బుధవారం
7 బక్రీద్ ఆగస్ట్ 12 సోమవారం
8 స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15 గురువారం
9 వినాయక చవితి సెప్టెంబర్ 2 సోమవారం
10 మొహర్రం సెప్టెంబర్ 10 మంగళవారం
11 గాంధీ జయంతి అక్టోబర్ 2 బుధవారం
12 దసరా అక్టోబర్ 8 మంగళవారం
13 దీపావళి అక్టోబర్ 28 సోమవారం
14 గురునానక్ జయంతి నవంబర్ 12 మంగళవారం
15 క్రిస్మస్ డిసెంబర్ 25 బుధవారం

Related Posts