అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సంచార జాతులకు చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి.మంగళవారం స్థానిక షిర్డీసాయి నగర్ సమీపంలో ఉన్న మొండిబండ కులానికి చెందిన వారు ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు.పార్టీ లోకి చేరేందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారి సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలను ఎమ్మెల్యే జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో జగన్మోహన్ రెడ్డి ఈరాష్ట్రానికి సీఎం కాబోతున్నారని అన్నారు. జగన్ ను ఆపే శక్తి రాష్ట్రంలో ఏఒక్క పార్టీకి లేదన్నారు.మనందరి ప్రభుత్వంలో మీ జీవితాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీలోకి చేరిన వారు మొండి నాగప్ప, ఎర్రిస్వామి, సుబ్బయ్య, వీరేష్, సీనా, సుబ్బమ్మ, అప్పాయమ్మ, సావిత్రమ్మ,సుంకమ్మ, మారెక్క తదితరులతో పాటు వైస్సార్సీపీ నాయకులు మొండి సుబ్బయ్య, జోగి వెంకటేసులు, జోగి భీమా, ఎంపీటీసీ లు చంద్రమ్మ, సులోచన,నాయకులు రామకృష్ణ, రాజశేఖర్, నాగేంద్ర, శ్రీరాములు,పక్కిరప్ప, మహేంద్ర, రామిరెడ్డి పాల్గొన్నారు.