YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణం

ఏపి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు మిగిలిన న్యాయమూర్తులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది.ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా... ప్రస్తుతం ఉన్న వారు 14 మంది.

Related Posts