YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి ఇదొక చరిత్రాత్మకమైన రోజు ఏపీ హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబునాయుడు

ఏపీకి ఇదొక చరిత్రాత్మకమైన రోజు    ఏపీ హైకోర్టు భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబునాయుడు
‘ఏపీలో హైకోర్టు ఏర్పాటు కావాలని ప్రజలు ఎంతోకాలంగా కోరుకున్నారు వారి కళలు నేడు నెరవేరాయి, మళ్లీ ఇన్నేళ్లకు విజయవాడలో హైకోర్టు ఏర్పాటైంది ఇది నాకెంతో సంతోషంగా ఉందని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీ హైకోర్టు భవనాన్ని విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.  ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ హైకోర్టు విభజన పూర్తయిందని  భావిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టాం. మనందరం కలిసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదాం. చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఉన్నాం. సంక్షోభాన్ని అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. ‘ఏపీలో హైకోర్టు ఏర్పాటు కావాలని ప్రజలు ఎంతోకాలంగా కోరుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు విజయవాడలో హైకోర్టు ఏర్పాటైంది. నూతన జడ్జిలంతా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారని ఆశిస్తున్నా. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన అందరి కలలు నెరవేరుతాయని ఆశిస్తున్నా. ఏపీ హైకోర్టు కోసం అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు అందజేస్తా.  మాతృభూమి రుణం అందరూ తీర్చుకోవాలి.  హైకోర్టు ఏర్పాటు కంటే వాటి విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. హైకోర్టు రావడంతో కక్షిదారులకు ఇబ్బందులు తగ్గుతాయి’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.అంతకుముందు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Related Posts