YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వదలని ప్లాస్టిక్ భూతం

వదలని ప్లాస్టిక్ భూతం
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని అరికట్టేందుకు జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు    ఏమేరకు ఫలితానిస్తాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 50 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉన్న సంచులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వాడకాన్ని గ్రామాల్లో  నిషేధించాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి  వ్యాపారికి ‘హెచ్చరిక పత్రాలు’ అందించాలని సూచించారు. సహకరించని వారిపై రూ.20వేల జరిమానాతో పాటు సదరు దుకాణాన్ని మూసివేయిస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో ప్లాస్టిక్‌ సంచులపై నియంత్రణ కొరవడటంతో విచ్చలవిడి వినియోగం పెరిగింది. నిత్యం కోటికి పైగా వాడుతున్నట్లు అంచనా. నెలకు సుమారు రూ.25కోట్లు పైబడే వ్యాపారం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై పట్టణాల్లో అవగాహన కల్పించి కొంత వరకు నియంత్రించినప్పటికీ తనిఖీలు మాత్రం తూతూ మంత్రంగా మారాయన్న ఆరోపణలున్నాయి. దీంతో అక్కడ, గ్రామీణ ప్రాంతాల్లో వాడకం బాగా పెరిగింది. వేడి వేడి ఆహార పదార్థాలను సైతం వీటిలో తీసుకెళుతుండటంతో ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు పారిశుద్ధ్యం క్షీణించటంతో పాటు మురుగుబోదెల శుభ్రత, చెత్త నుంచి సంపద తయారీకి ఆటంకంగా మారాయి.
జిల్లా జనాభా సుమారు 40లక్షలు కాగా 10.50లక్షలు కుటుంబాలున్నాయి. ప్రస్తుతం కొనుగోలు చేసిన ప్రతి వస్తువును తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్‌ సంచులనే వాడుతున్నారు. దీంతో నిత్య జీవితంలో ఇది ఒక భాగమైపోయింది. అన్ని వ్యాపార సంస్థల్లోనూ వినియోగం విచ్చలవిడిగా మారింది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, కిరాణా దుకాణాలు, మాంసం, పాల కేంద్రాలు, భోజనం హోటల్స్‌, అల్పాహార కేంద్రాలు, కూరల విక్రయ దుకాణాల్లో వాడుతున్నారు. వేడి పదార్థాల కారణంగా రసాయనాలు కరిగి క్యాన్సర్‌, గ్యాస్‌ట్రబుల్‌, కిడ్ని వ్యాధులకు గురవుతున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వంటి పట్టణాల్లో నిర్వహించే సంతలు, డైలీ మార్కెట్‌లతో పాటు 909 గ్రామాల్లో జరిగే సంతల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఒక్కో వ్యాపారి సగటున రోజుకు రెండు కేజీల సంచులు ప్రజలకు ఇస్తున్నారు. అంటే సుమారుగా 400 వినియోగిస్తున్నారని అంచనా.
50 మైక్రాన్ల మందానికి పైబడి ఉన్న కవర్ల వినియోగానికి అనుమతి ఉందని చెబుతున్నా, నిజానికి ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి మందం ఎంత? ఎక్కడ తయారు చేస్తున్నారనే వివరాలు ముద్రించడం లేదు. గుర్తొచ్చినప్పుడల్లా అధికారులు దాడులు చేస్తుండటంతో నేరుగా గ్రామాల్లోకి వచ్చే చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణాల్లో నిషేధించినా ఫలితం లేకుండా పోయింది. 16×20 పరిమాణం ఉన్న సంచులు రెండు కేజీల బరువు ఉన్న సరకులు వేస్తే చిరిగిపోతాయి. ప్రస్తుతం చైనా పేరుతో మార్కెట్లో చలామణి అవుతున్నవి ఆరుకేజీలు బరువు వేసినా సాగుతున్నాయి తప్ప తెగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వీటి వినియోగం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts