Highlights
- ఆ శిశువు తల్లి ఎవరో..?
- అత్యాధునిక టెక్నాలజీ ఆధారం
నరబలి ఘటనలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. బలికి గురైనశిశువు తల్లి ఎవరన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సికింద్రాబాద్ బోయిగూడ ప్రాంతం నుంచి ఆడశిశువును తీసుకు వచ్చానని స్పష్టం చేసిన నిందితుడు రాజశేఖర్ శిశువు తల్లి ఎవరు అనే విషయాన్ని వెల్లడించడం లేదు. రెక్కీ నుంచి శిశువు ను మర్డర్ చేసే వరకు సాంకేతిక పరిజ్ఞాణంతో రాజశేఖర్ లోకేషన్‌ను నిర్ధారించిన పోలీసులు మాత్రం ఆ శిశువు తల్లి ఆచూకీని మాత్రం గుర్తించలేకపోయారు. పలు దఫాలుగా రాజశేఖర్, అతని భార్య శ్రీలతను గంటలకొద్దీ విచారించిన వారి నోట నుంచి ఒక మాట బయటికి రాలేదు. మైండ్‌లో బలి విషయాన్ని బయటికి చెప్పొదని నిర్ణయించుకోవడంతో పోలీసుల ప్రశ్నలకు నిందితుల నుంచి జవాబులు రాలేదు. 15 రోజుల పాటు పోలీసులు నిర్వింహిచిన విచారణ ప్రక్రియను పరిశీలిస్తే.. నిందితులు అసలు విషయాన్ని చెప్పితే చేసిన క్షుద్ర పూజకు ఫలితం ఉండదనే గట్టి నమ్మకంతో పెదవి విప్పడం లేదు. కేవలం సాంకేతికంగా వెలుగు చూసిన అంశాలకు మ్యా పింగ్ చేసి ఆ ప్రాంతాల్లో ఆ సమయంలోఎందుకు ఉన్నావనే ప్రశ్నలకు రాజశేఖర్ బదులు ఇవ్వడంతో అప్పుడు పోలీసులకు కేసు పురోగతిలో కొంత స్పష్టత వచ్చింది. అలా దర్యాప్తును సాగించిన పోలీసులు చివరకు టెక్నాలజీ సహాయంతో నరబలి క్రైమ్ సీన్‌ను రీ కన్‌స్ట్రక్ట్ చేశారు.
అత్యాధునిక టెక్నాలజీ...
ఈ నరబలి అంశం వెలుగులోకి వచ్చిన 9 రోజులు గడుస్తున్నా ఏలాంటి పురోగతి లేకపోవడంతో రాచకొండ పోలీసులు శాస్త్రీయంగా ఆధారాలను సేకరించేందుకు మరోసారి దృష్టి సారించారు. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 9 వ తేదిన రాజశేఖర్ ఇంట్లో హైదరాబాద్ క్లూస్ టీం వెంకన్న సారధ్యంలోని బృందం రంగంలోకి దిగింది. ఆ రోజు వారు తమ వద్ద ఉన్న పౌడర్‌లు, పరికరాలను ఇంట్లో చల్లి అల్ట్రా బ్లూ లైట్ రేస్ తో షాబాద్ బండలతో పాటు ఇంటి తలుపుకు అంటిన రక్తపు మరకను గుర్తించారు. ఆ మరకలను సేకరించిన తర్వాత శిశువు తల నుంచి సేకరించిన రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. అప్పుడు రక్త నమూనాలు సరిపోవడంతో పోలీసులకు ఈ సంఘటన నరబలిగా నిర్ధారణై దర్యాప్తును వేగవంతం చేయడంతో రాజశేఖర్ మెల్లిగా మెల్లిగా నోరు విప్పడం ప్రారంభించాడు. చివరకు శిశువు బోయిగూడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చి చంద్రగ్రహణం రోజు బలి ఇచ్చినా అంశాన్ని బయటపెట్టాడు.ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మరిన్ని ఆధారాలు దొరికాయి. నిందితుడు రాజశేఖర్, ఆయన భార్య శ్రీలత పలు సందర్భాల్లో పూనకం వచ్చే మహిళలతో మాట్లాడుతున్నప్పుడల్లా నరబలి గురించే ఎక్కువగా మాట్లాడిన విడియోలు, ఆడియోలు వారి మొబైల్ ఫోన్‌ల నుంచి పోలీసులు సేకరించారు. కొన్నింటిని డిలీట్ చేసినా వాటిని పోలీసులు టెక్నాలజీతో బయటికి తీశారు. ఓ పూనకంతో వచ్చిన మహిళతో రాజశేఖర్ సెల్ఫీ విడియో తీసుకుంటూ దుష్టశక్తులు తరిమివేయడానికి నీకు దున్నపోతు, మేక, గొర్రె, నరబలి కావాలా అంటూ మాట్లాడిన వైనం అతను క్షుద్ర పూజలకు ఏంత ఆకర్షితుడైయాడో స్పష్టమైంది. ఇలా మూడు సంవత్సరాల నుంచి నరబలికి సంబధించిన అంశాలపై చాలా మంది, చాలా సందర్భాల్లో రాజశేఖర్ వివరాలు సేకరించడాన్ని తెలిసింది. చిన్నప్పటి నుంచి వీటిపై ఆసక్తిని పెంచుకున్న రాజశేఖర్ ఆర్థిక ఇబ్బందులు, వాస్తుదోషాలు, అనారోగ్యాలను వీటితోనే పరిష్కరించుకోవాలని ప్రయత్నించి కటకటాల పాలైయ్యాడు. హత్యకు గురైన శిశువు డీఎన్‌ఏను పోలీసులు గాంధీ ఫోరెన్సిక్ వైద్యుల వద్ద భద్రపర్చారు.