YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచన మహాకూటమి ఫై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ

ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచన           మహాకూటమి ఫై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు అవుతున్న మహాకూటమి ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచనగా కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అభివర్ణించారు. అందుకు తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణలో ఇటువంటి మహాకూటమే ఏర్పాటై తెరాసపై పోటీ చేసింది. తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తులకు జరిగిన పోటీ ఇది. ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాసను ఓడించాలనుకుని విఫలమయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఫలితమే లోక్‌సభ ఎన్నికల్లోనూ వస్తుందని ఆయన అన్నారు. భిన్నమైన భావజాలాలు కలిగిన పార్టీలన్నీ కలవాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు.‘మహాకూటమి అనేది భారత్‌ను భయపెట్టే ఆలోచన. అలాగే, దానికి ఇప్పటికే బీటలు పడుతున్నాయి. వారిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి’ అని జైట్లీ అన్నారు. ఓ వైపు కాంగ్రెస్‌, డీఎంకే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, తెలుగు దేశం పార్టీ కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంటే, మరోవైపు తెరాస, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజూ జనతా దళ్‌ కలిసి కాంగ్రెస్‌-భాజపాయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. మహాకూటమి అనేది ఇప్పటికే పరీక్షించి, విఫలమైన ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. తమ పాలనలో వ్యవసాయ రంగంలోనూ అత్యుత్తమ సేవలు అందుతున్నాయని అన్నారు. మోదీ మళ్లీ మన ప్రధాని కావాలా? లేదా అస్పష్టమైన విధానాలతో ఏర్పాటవుతున్న కూటమి అధికారంలోకి రావాలా? అనే విషయంపై ఆలోచించి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని ఆయన అన్నారు.

Related Posts