చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ ఉంది. చంద్రబును మించిన చాణుక్యుడు ఎవరు లేరన్నది అనేక సందర్భాల్లో నిరూపితం కూడా అయ్యింది. ఎన్టీఆర్ వున్న సమయంలోనే చంద్రబాబు ఒక వర్గం మీడియా ను తనకు అనుకూలంగా మలుచుకుని మామ పైనే తిరుగుబాటు చేసి మీడియా సహకారంతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తరువాత పలు పత్రికలు, ఛానెల్స్ ను తన వర్గం వారితో ఏర్పాటు చేయించి బాబు అంటే మీడియా.. మీడియా అంటే బాబు అన్నంతగా మరింత పాపులర్ అయ్యారు. చంద్రబాబు చీమంత చేసింది కొండంతగా ప్రచారం చేసే పరిస్థితి ఉండటంతో ఏపీ లో ఆయన హవాకు ఎదురు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బాబుకు వెన్నెముకగా వుంటూ వస్తున్న మీడియా వైఖరిపై అటాక్ చేశారు కేసీఆర్. చంద్రబాబు మీడియా పోకడలను గతంలో వైఎస్ టార్గెట్ చేసినంతగా ఎవ్వరు చేయలేక పోయేవారు. అసెంబ్లీ సాక్షిగా ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్సాఆర్ నేరుగా బాబుపైనా ఆయన కు సహకరిస్తున్న మీడియా పై విరుచుకుపడేవారు. ఆ తరువాత ఆ స్థాయిలో బాబు అండ్ ఆయన మీడియా పై నేరుగా డేర్ గా విమర్శనాస్త్రాలు సంధించిన వారు లేనేలేరు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేసారు కెసిఆర్. చంద్రబాబు మీడియా పోకడలను తూర్పార